Monday 30 January 2012

ఆరోగ్యం

ఆరోగ్యం
చెమట పట్టిన వాడికే ముద్ద తినే హక్కుంటుందని పెద్దలు అంటుంటారు.ఇదెంత సత్యమో ఆలోచిస్తే అర్థమవుతుంది.శ్రమ జీవులు అధిక ఆహారం తీసుకోవాలి .చేసే పనికి ఎక్కువ శక్తి అవసరం కాబట్టి .కాని శ్రమ లేని జీవులు ఆహారం మితంగా తీసుకోవాలి.కాని అంతా విరుద్ధంగా జరుగుతుంది .సరే తీసుకున్నారు మరి దానిని ఖర్చు చేయాలి కదా! ఎలా! ఇంకెలా ! వంటికి చెమట పట్టించడమే 
        మరి సిద్ధమా !శ్రమ చేసే పనులు లేనివారందరూ ప్రతి రోజు 1 గంట వ్యాయామానికి కేటాయించాలి.ఇదంతా సులభమా కష్టమే కాని ఆరోగ్య లక్ష్యం పెట్టుకున్నవారు ఈ విషయాన్ని పాటించాలి.కాని చాలామంది మొదలెడతారు కాని కొద్ది కాలానికి ఆపి వేస్తుంటారు .అలా ఆపి ఇక  మనం కొనసాగించలేము అని పూర్తిగా మానేస్తుంటారు.వారికి ఒక సలహా గుర్తు వచ్చినప్పుడు మరల మొదలెట్టండి.ఎన్ని సార్లు ఆపివేసిన పరవాలేదు .

   వివేకానందుడు చెబుతాడు కదా ఉక్కునరాలు,ఇనుప కండరాలు కల యువత కావాలని .అంత కాకపోయినా మనం మన ఆరోగ్యం కోసం ఆమాత్రం శ్రద్ధ తీసుకోకపోతే ఎలా .సరే ఏమి చేస్తే బాగుంటుంది .మొదట సరళం గా మొదలెట్టండి .
మీకు తెలిసిన చిన్నచిన్న వ్యాయామాలు చేయండి .దగ్గరలో జిం వుంటే అందులో చేరడమో లేదా కొన్ని శిక్షణా సంస్థలు ఆసనాలు,ప్రాణాయామం ధ్యానం లాంటివి నేర్పిస్తుంటారు మీకు ఎలా అనుకూలం గా వుంటే అది .నడక కూడా ఆరోగ్యానికి మంచిదే .కాని నడక కంటే ఆసనాలు ఇంకా మంచిది అని నా అనుభవంమీ ఇష్టం. 
                ఈ వాక్యాన్ని గమనించండి .దేహమున్నంత వరకు వ్యాయామము,శ్వాస ఉన్నంత వరకు ప్రాణాయామము ,మనసున్నంత వరకు ధ్యానం చేయాలట .
         మరి మొదలెడతారా !            
                

No comments:

Post a Comment