Monday 20 February 2012

స్నేహితుడు సినిమా ఎందుకు చూడాలి?

విద్యార్థులు,తల్లిదండ్రులు ఉపాధ్యాయులు,అధ్యాపకులు, యాజమాన్యాలు, ప్రభుత్వ విద్యా శాఖ ,విద్యకు సంబంధించిన    ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాలి. ఇదేంటి !ఈ సినిమాకు ప్రచారం చేస్తున్నాడు అనుకుంటున్నారా!
    హిందీలో 3 idiots చూడలేకపోయాను.ఈ స్నేహితుడు చూసిన   తర్వాత చూడమని  చెప్పకుండా                                                  ఉండలేకపోతున్నాను  .ఎందుకో వినండి! మొత్తం మన విద్యా  వ్యవస్థ లక్ష్యం విద్యార్థులందరినీ  ర్యాంకులు,మార్కులతో విభజిస్తూ భవిష్యత్ గుమస్తాలను తయారు చేసే దిశగా సాగుతోంది.బ్రిటిష్ మెకాలే ప్రవేశపెట్టిన వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది.లేకపోతే ర్యాంకులు, మార్కుల లక్ష్యముగా భోధన జరుగుతుందేకాని విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని అభివ్రుద్దిచేసే విధానాలు భోధనలో లేవు.
         విద్యా వ్యవస్థను రెండు భాగాలుగా చేసి విశ్లేసిస్తే 1)L.KG  నుండి   12 వ తరగతి 2)ఉన్నత విద్య
ఉన్నత   విద్య అయిన మెడిసిన్ ఇంజనీరింగ్ ఎంట్రన్సు లకు శిక్షణా కేంద్రాలుగా పాటశాలలు మారి పోయాయి. .ఉదాహరణకు 10,000 సీట్లు ఉండే  I.I.T  ఎంట్రన్సు కోసం   5 లక్షలమంది,  A.I.E.E.E  కోసం  10 లక్షల మంది విద్యార్థులు   శిక్షణ పొందుతూ ఉంటె వీటికి  foundation course  పేరిట ఆరవ తరగతి నుండి దేశ వ్యాప్తంగా మరి కొన్ని లక్షలమంది  గణితము, సైన్సునే  application orriented లో అభ్యసిస్తున్నారు  .ఆటలు,పాటలు,కళలు moral values, సైన్సు ప్రయోగాలు అన్ని పాటశాలల లో శూన్యం. ఇలా తయారైతే భవిష్యత్తులో   వీరు ఏమవుతారు   ఉన్నత విద్యలో కూడా సినిమాలో చూపినట్లు ఎక్కడా విద్యార్థి సృజనాత్మకతకు, పరిశోధనకు అవకాశం ఇవ్వకుండా జరిగే విద్యా భోధన  శాస్త్రవేత్తలను ఎలా  తయారు చేయగలదు. అమెరికా డాలర్స్ సంపాదించే కంప్యూటర్  మనుషులను  తప్ప!
                ప్రస్తుత సమాజ అవసరాలఫై    అధ్యయనం చేయని విద్య, పరిశోధనకు ప్రాముఖ్యత    ఇవ్వని విద్య,పరిశ్రమలతో  ప్రత్యక్ష అనుసంధానము లేని విద్య ఎలా భావిభారత పౌరులను తయారుచేయగలదు?మన దేశ బడ్జెట్ లో 2% విద్యకు కేటాయించి ఏమి సాధించాలి?అందులో పరిశోధనకు మరింత తక్కువ కేటాయిస్తారు.6% కేటాయిస్తే కొంతవరకు న్యాయం చేసినట్లు.
        భారత మానవ వనరుల శాఖ నిర్ణయించినట్లు,దేశవ్యాప్త ఇంజనీరింగ్ ఎంట్రన్సు పెడుతూ దానిని SAT(USA) తరహాలో కోచింగ్ లకు ఆస్కారం లేని విధం గా సిలబస్ లోనే ఆయా అంశాలఫై  భోధన వుండే విధం గా తయారు చెయ్యాలి.పాటశాల స్థాయిలోర్యాంకులు ,మార్క్స్ గొడవ తీసివేసి సమగ్ర మూల్యాంకనం ప్రవేశ పెట్టాలి.అప్పుడే విద్యాలయాలు బాగుపడతాయి  .
                  ఈ సినిమా ఆదిశగా ఆలోచింప చేస్తుంది.ఇంత హృద్యంగా కథను తయారుచేసిన రాజు హీర్వాని దాన్ని మన భాష లో అద్భుతంగా అందించిన శంకర్ గారిని,విజయ్ మరియు  సహనటుల్ని  ,అభినందించకుండా   ఉండలేము.
                 అందుకే  "స్నేహితుడు" సినిమా చూడండి.  

No comments:

Post a Comment