Thursday 28 November 2013

అభివృద్ది పల్లవించిన గంగదేవిపల్లె


            ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి . ఆ సమావేశాల్లో గంగదేవిపల్లెను గురించి చెబితే బాగుంటుంది.
            పల్లెలన్నీ నిరక్షరాస్యత ,జీవన ప్రమాణాల తరుగుదల ,పేదరికం ఆకలి చావులు వంటి సమస్యలతో కునా రిల్లి  పోతున్నాయి.వాటికి అతీతమైనదేమీ కాదు ఒకప్పటి గంగదేవిపల్లె.అప్పుడు ఆ ఊరు మద్యం మత్తులో ముని గి తేలుతుంది.రోడ్లు లేవు కరంటు లేదు.ఊరంతా ఫ్లోరైడ్ నీళ్ళు .అధికారులు,రాజకీయ నాయకులు పట్టించు కున్న పాపాన పోలేదు.ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ జిల్లా,గీసుకొండ మండలంలో ఉంది.
         కూసం రాజమౌళి ఆయన మిత్రులు గొనె చేరాలు,చల్ల మల్లయ్య,కూసం నారాయణ పెండ్లి రాజయ్య ఓ జట్టుగా కలిసి ఆ ఊరిని ఆదర్శంగా తయారు చేయాలని సంకల్పించారు.గ్రామ ప్రజల్లో చైతన్యం కల్పించారు.ఆ ఊరిలో బడి లేదు డాక్టర్ లేడు. శివారు గ్రామం,పంచాయతీ కూడా కాదు. మద్యం తో అందరు ఇంట బయటా గొడవ పడుతుండే వారు.నాటు సారా త్రాగి చని పోతుండేవారు.రాజ మౌళి ఆయన  మిత్రులు కలిసి ఊర్లో సారాపై నిషేధం విధించారు.  ప్రతి ఇంటికి వెళ్లి త్రాగుబోతులకు నచ్చజెప్పారు.సారా contractors వ్యతిరేకించారు.అయినా లెక్కచేయకుండా అభి వృద్ది వైపు తోలి అడుగు వేసారు.1994 లో ఈ గ్రామానికి పంచాయతీగా గుర్తింపు వచ్చింది.
             తరువాత నీటి కమిటీని ఏర్పాటు చేసి గ్రామస్తుల చందాలతో  రూ 53000 వసూలు చేసి లోడి ,బాల వికాస్
సంస్థల  సహకారంతో కుళాయిల ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేసుకున్నారు. టాటా కంపెనీ సహాయంతో ఫ్లోరైడ్    రహిత త్రాగునీరు ఏర్పాటుచేసుకున్నారు.2000 సంవత్సరం సిమెంట్ రోడ్లు ,వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు అయ్యాయి.కానీ ఊరంతా ఆరుబయట మలమూత్ర విసర్జనాలు చేస్తుండేవారు.పారిశుధ్యం పై వారిలో చైతన్యం కల్పిం చారు రాజమౌళి.జరిమానాలు హెచ్చరికలతో ఊరంతా దారికి వచ్చారు.తరువాతి కాలంలో అక్షరాస్యతపై నాటి కలు వేయించి రాత్రి బడులు తెరిపించారు.పది మంది నిరక్ష్యరాస్యుల బాధ్యత ఒక అక్ష్యరాస్యుడికి అప్పగించారు. 2002 నాటికి 100% అక్ష్యరాస్యత సాధించారు.పిల్లలందరినీ బడిలో చేర్చారు .
            తరువాత పచ్చదనానికి ప్రాధాన్యత నిచ్చి ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటేలా తప్పనిసరి చేసారు. మొక్క పెంచకపోతే మంచి నీళ్ళు కట్ చేసారు.ఆ వూరిలో కరంట్ చౌర్యం చేయరు.సకాలంలో బిల్లులు చెల్లిస్తారు. తగాదాలు పంచాయతీలోనే పరిష్కరించుకుంటారు. గ్రామ పెద్దలే తీర్పు ఇస్తారు ఎన్నికల్లో మందు,నోట్ల పంపిణీ నిషేదించారు.1995 నుంచి ఇప్పటివరకు ఏకగ్రీవ ఎన్నికలే ఊర్లో మహిళలే మహారాణులు.1995 నుంచి అందరు మహిళలే వార్డ్ members 14 పొదుపు సంఘాలున్నాయి .కెనడా,బంగ్లాదేశ్ ల నుంచి వచ్చిన సంస్థలు గ్రామ అభివృద్ధిని మెచ్చుకున్నాయి . శిక్షణ కొచ్చిన ప్రతి ఐఏఎస్ కు ఈ ఊరు ఓ పాట్యాంశం. 2005 లో పంచాయతీరాజ్ కమీషనర్ చెల్లప్ప "దేశం లో ప్రతి జిల్లాలో ఇలాంటి గ్రామం ఒకటుండాలి" అన్నాడు .
           గ్రామం లో 13 అభివృద్ది కమిటీలు వేసారు. రూపాయికి 20 లీటర్ల మినరల్ వాటర్ సదుపాయం కల్పించారు
2007 లో  ఈ గ్రామం దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికయింది . కూసం రాజమౌళి గారు అప్పటి నుంచి సర్పంచ్చ్ గా కొనసాగుతున్నారు.ఈ గ్రామం అగ్రశ్రీ అవార్డ్ సాధించింది.నిర్మల్ గ్రామ పురస్కారం అబ్దుల్ కలాం ద్వారా స్వీకరించారు . వివిధ పార్టీలున్నా ఊరి మంచికోసం అందరూ స్పందిస్తారు .
         ఇలాంటి గ్రామాలు దేశమంతా ఏర్పడితే దేశం అభివృద్ది చెందిన దేశంగా మారుతుంది.
             (ఈ సమాచారం ఈనాడు ఆదివారం నుండి సేకరించ బడింది .వారికి ధన్యవాదాలు )

2 comments:

  1. * చక్కటి విషయాలను అందించారు.
    * సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న తపన ఉండి అందరూ కలిసి గట్టిగా కృషిచేసినప్పుడు అభివృద్ధి సాధ్యమే.
    * గంగదేవిపల్లె యొక్క అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు.
    * ఇలాంటి ఆదర్శ గ్రామాలను చూసి మిగతా వారు తమ ఊళ్ళను కూడా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు.
    * "దేశం లో ప్రతి గ్రామం, ప్రతి నగరం ఇలా మారాలి."

    ReplyDelete
  2. మీ స్పందనకు ధన్యవాదాలు. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు.

    ReplyDelete