Wednesday 30 October 2013

అన్ని గ్రామాలు హివ్రే బజార్ లా ఉంటే ఎంత బాగుంటుందో కదా!


                    ఆంధ్రప్రదేశ్ లో 3 నెలల క్రితం పంచాయతీ ఎన్నికలు జరిగాయి .నిన్ననే సర్పంచ్ లకు చెక్ పవర్ వచ్చింది .మరి గ్రామాలు ఎలా ఉండాలి?మహాత్ముడు కలలు గన్న గ్రామ స్వరాజ్యం ఎక్కడుంది? సర్పంచ్ ల నాయ కత్వంలో ప్రజలు సమిష్టి కృషితో ఏ విధంగా అభివృద్ది సాగించాలి? అనే విషయాలను మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లా  నగర్ తాలుకాలోని హివ్రేబజార్ గ్రామాన్నిపరిశీలిస్తే అర్థమవుతుంది.
           ప్రపంచంలోని వంద దేశాల ప్రతినిధులు సందర్శించిన పల్లె అది.సర్పంచ్ ఎలా ఉండాలో ప్రజలెలా  ఉండాలో ఆదర్శ గ్రామాలు ఎలా ఉండాలో నిరూపించిన గ్రామం ఇది.ఆ వూరి సర్పంచ్ పేరు పోపట్రావు పవార్.ప్రజలు,నీళ్ళు అడవి,జంతువులు ఆయన అజెండా!అంతర్గత శతృవులయిన కరవు ,పేదరికం నిరుద్యోగం,అనారోగ్యం ఇవే కదా ! పల్లెలకు శత్రువులు .వీటిపై మరో స్వాతంత్ర్య పోరాటం చేయాలని పిలుపు నిచ్చాడు జల సంరక్షనే ప్రధాన లక్ష్యం వాన చినుకుల్ని ఒడిసి పట్టుకున్నారు.ప్రభు త్వ నిధులు ఒక్క పైసా దుర్వినియోగం కాకుండా 600 ఇంకుడు గుంతలు త్రవ్వుకున్నారు. checkdam  లు కట్టుకున్నారు.పల్లె అంతా బిందు సేద్యమే!నీటి ఆడిట్ పద్ధతిని ఏర్పాటు చేసుకుని గొట్టపు బావులు నిర్మించారు.గ్రామసభలోచర్చించి ఎవరు ఏ ఏ పంటలు వేయాలో నిర్ణయిస్తారు. అన్ని వసతుల గల  పాటశాల నిర్మించుకున్నారు.ఒక్క దోమ కూడా అక్కడ కనపడదు .ప్రతి ఇంటికి మంచి నీటి కుళా యిలు,మరుగు దొడ్డి ఉన్నాయి.భూగర్భ డ్రైనేజి వ్యవస్థ ఉంది.ఊరంతా బయో గ్యాస్ తో వంట చేస్తారు.దొంగ  తనాలు దోపిడీలు లేవు. మద్యపానం అక్కడ నిషిద్ధం. వ్యాయమశాల,గ్రంధాలయం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పశు వుల ఆసు పత్రి ఆడిటోరియం ఉన్నాయి.నిధులు ప్రభుత్వానియే అయినా ఇవన్నీ ప్రజలు శ్రమదానం ద్వారా కట్టుకున్నవే! పల్లె బాగుపడాలంటే ప్రజల్లో సమైక్యత ఉండాలి .సహకార స్పూర్తి కావాలి..ఇదే  గ్రామీణ భారత ధార్మిక నీతి... ---హివ్రేబజార్ విజయ  రహస్యము ..
         1989 నుండి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న పోపట్ రావు M.COM. చదివారు.అన్నాహజారెను ఆదర్శంగా తీసుకుని ప్రజల్లో నైతిక విలువలు పెంపొందించారు .సార్క్ సదస్సులో తన అనుభవాన్ని పంచుకున్నారు.వివిధ విశ్వవిద్యాలయాలు,మేనెజ్ మేంట్ స్కూల్స్ లో  గ్రామీణాభివృద్ది గురించి మాటలాడారు.మహారాష్ట్ర  ప్రభుత్వం  golden jubilee india programme క్రింద 300 గ్రామాల్ని హివ్రేబజార్ లా తీర్చిదిద్దాల్సిన  బాధ్యత  ఆయనకు అప్పగిం చింది జాతీయఅవార్డ్  అందుకున్నారు.రాజకీయ party లు ఆయనకు  M.L.A పదవి  ఇస్తామన్నా వద్దన్నారు .
              మన  రాష్ట్ర  సర్పంచ్ లంతా  హివ్రే బజార్ చూసి వచ్చి ఇక్కడ కూడా అలా చేస్తే  బాగుంటుంది కదా!
(ఈ వ్యాసం ఆదివారం ఈనాడు అనుబంధం లోనిది .వారికి ధన్యవాదాలు.)
  మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్  ను గమనించండి
http://www.rainwaterharvesting.org/Rural/Hirve.htm  

Sunday 20 October 2013

తల్లిదండ్రులూ!పిల్లలకు bikes,cars ఇచ్చేముందు ఓ సారి ఆలోచించండి! .

           ఓ హృదయ విదారక సంఘటనను చూసిన తరువాత ఈ వ్యాసం వ్రాయాల్సి వచ్చింది. స్కూల్స్ colleges తెరిచిన తొలి రోజు మేము స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా ఒక విద్యార్థి ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకువస్తూ ఒక కల్వర్ట్ దగ్గర accident కు గురై అబ్బాయి చనిపోగా ఆ అమ్మాయికి కాలు విరగటం జరిగింది.నేను బస్సులో అక్కడికి వచ్చే ఓ 5 నిముషాల ముందే అది జరిగింది. ఆ అమ్మాయి ఆ అబ్బాయి అక్క అని తరువాత తెలిసింది  ఆ తల్లితండ్రుల కెంత గర్భశోకం. ఆ అబ్బాయి ఇంటర్ పూర్తిచేసి ఇంజినీరింగు వెళ్ళాల్సి ఉంది అమ్మాయి ఇంజినీరింగ్ చదువుతూ ఉంది.అక్కను కాలేజీ నుండి ఇంటికి తీసుకు వస్తుండగా జరిగింది ఈ సంఘటన.
          ఇటువంటి సంఘటనలు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి.పిల్లల కోరిక మేరకు bikes,cars కోరిక మేరకు కొని ఇస్తున్నారు.వాటిని అతి వేగంతో నడపటం,లేదా ఎదురుగా వచ్చేవాహనాల పొరపాటుతో ప్రమాదాలు జరగటం చూస్తున్నాం .బాబు మోహన్ ,అజహరుద్దీన్ కోట శ్రీనివాసరావు ,కోమటిరెడ్డి వెంకట రెడ్డి వీరి కుమారులు  ఈ విధం గా చనిపోయిన వారే!18 సంవత్సరాల వయసు నిండదనిదే వాహనం నడపకూడదు.12 సంవత్సరాల పిల్లలు కూడా నడుపుతున్నారు.వారికి bikes నడపటానికి parents ఎలా అనుమతిస్తున్నారో అర్థం కాదు.అలాగే ట్రాఫిక్ పోలీస్ పట్టించుకోవటం లేదు.అతి వేగంతో నడపటం కాకుండా ఒక్కో  బైక్ మీద ముగ్గురు కూడా ప్రయాణం చేస్తుంటారు town limits లోకూడా అతి వేగంగా వెళ్లి పాదచారులను ప్రమాదాలకు గురిచేస్తున్నారు.ఇక driving licence లేకుండా నడిపే వారెంత మందో!అడిగే వారెవరూ లేరు.
              ఈ విషయం చాలా serious గా ఆలోచించాల్సిన అంశం . లేక పోతే దేశానికి ఎంతో విలువైన యువత అర్థాంతరంగా రాలిపోతున్నారు.ఇది  తల్లిదండ్రులు,ట్రాఫిక్  వ్యవస్థ ,పౌర సమాజం స్పందించాల్సిన అంశం .

Tuesday 15 October 2013

విశ్వ నరుడు(స్టీఫెన్ హాకింగ్ పై పాపినేని శివశంకర్ కవిత)

physically challenged  కాదు
Physics నే  challenge చేసినవాడు
దేహ విధ్వంసం చేసే
మోటార్   న్యురాన్  వ్యాధిని
విజ్ఞాన వ్యాయామంతో
అధిగమించినవాడు
ధ్వనులుగా పొల్లులుగా  విడిపోయి
పడిపోయిన మాటని
speech synthesizer లో స్థిరపరుచుకున్నవాడు
ప్రపంచంలో ప్రతి వికలాంగుడికి
గుండెదిటవు నిచ్చినవాడు
కాస్మిక్ కడలిలో
బుద్ది బాహువుల గజ ఈతగాడు
కాల్లూ చేతులు  ఆడకపోయినా
కాలబిలంలో ఏరోబిక్స్ చేసినవాడు
అండాండ పిండాండాల నులిపోగుల్లో
ఉయ్యాల లూగినవాడు
విశ్వానికి అంతం లేదని పంతంతో
బ్రహ్మాండానికి Grand design నిర్మించి
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికే
ప్రవేశం నిరాకరించినవాడు
వికలాంగుడు కానే కాడు
సకల మేధాంగ  సుందరుడు
స్టీఫెన్ హాకింగ్  einstein కు
అసలైన వారసుడు

Sunday 13 October 2013

అన్నార్తులకు ఇ-సాయం

              ప్రపంచ వ్యాప్తంగా తినేందుకు తిండి లేక ప్రతిరోజు 24,000 మంది చనిపొతున్నారు.వీరిలొ 3 వ వంతుమంది 5 సంవత్సరాల వయసు లోపు చిన్నారులే .ఈ విషయం తెలుసుకున్న జాన్ బ్రీన్ అనే కంప్యూటర్ ప్రోగ్రామర్  ఇంటర్నెట్ తో అన్నదానాన్ని ముడి పెట్టాలనుకున్నాడు .ఈ ఆలోచన పలితమే hungersite అనే website.1999 june లో ఏర్పాటయింది.తరువాత  ఆర్ధిక  సమస్యల  కారణంగా ఈ సైట్ charityusa   అనే సంస్థ చేతుల్లోకి వెళ్ళింది.
              కొన్ని సంస్థలు విరాళాలు తీసుకుంటాయి.కానీ ఈ సైట్  మనం చేసే క్లిక్ ల ఆధారంగా నడుస్తుంది www.thehungersite.com  open చెయ్యగానే  click here its free అని  వస్తుంది రోజు కొక సారి క్లిక్ చెయ్యటమే అలా చెయ్యగానే మనం  thankyou పేజి లోకి వెళ్తాము అక్కడ కొన్ని వ్యాపార ప్రకటనలు ఉంటాయి.  మనం   కొన్నా    కొనకపోయినా చూస్తె  చాలు.స్పా న్సర్స్ hungersite కు foodpackets  పంపిస్తారు అది వాళ్ళ మధ్య ఒప్పందం .ఈ సైటుకు అమెరికా లోని mercycore,second harvest అనే  సంస్థలు  సాయం  అందిస్తున్నాయి.
             ఇంకా ఈ సైట్ లో breastcancer,animals,veterans,autism,diabetes,literacy,rainforest వంటి సమస్యలకు కూడా సైట్స్ ఉన్నాయి .
            ప్రతి రోజు ఒక్క  సారయినా ఈ  సైట్ లోకి వచ్చి క్లిక్స్ ఇవ్వడం ద్వారా ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపిన వారమవుతాము. మరెందుకు ఆలస్యం ఈ రోజే మొదలెడదాము.

www.thehungersite.com
(ఈ సమాచారం ఆదివారం ఈనాడు అనుబంధం  లోనిది .వారికి ధన్యవాదాలు)