కవితలు

బాల్యం 1
బాలల పెదాలఫై
చిరునవ్వుల చిరునామా లేదెందుకు ?
స్వచ్చమైన  ఆ కళ్ళల్లో నిశ్చలమైన
నిర్వికారమైన  దైన్య మెందులకు   
  లేత  రెమ్మల్లాంటి  ఆచేతుల్లో
కందిన ఆ కాయల వెనుక కథలేమిటి ?
తల్లి చేతుల స్పర్శతో తన్మయం
చెందాల్సి న ఆ  తలఫై  బొప్పుల గుర్తులేమిటి ?
పాల్గారు పాదాల కోమలత్వం
కరకు రాతిబాటల పడి కమిలినకారనాలేమిటి ?
గని నుండి, పనినుండి,
క్వారీ నుండి,కార్ఖానాల నుండి,చేలనుండి
రాల్లెత్తుతూ,బరువులు మోస్తూ
విషవాయువులు పీలుస్తూ
చిన్నపని,పెద్దపని అంతా తామై  మోస్తూ
అవిద్య,అజ్ఞానం,అంధకారం లో
మగ్గుతున్న నిస్సహాయులయిన బాలల బ్రతుకుచిత్రం
ఛిద్రం  కావలసిందేనా!లేదు!లేదు!
నేటిబాలలునేటి పౌరులే
వారికీ హక్కులుంటాయి 
బడిబయట పిల్లలంతా బాలకార్మికులే
బాలలకు బద్రత బడిలోనే
అప్పుడే వారి జీవితాల్లో వెలుగులు  నిండుతాయి 

బాల్యం 2
ఎదుగుతున్న లేత శరీరాలఫై
కర్కశంగా బరువు మోపుతున్న సమాజం
వికసిస్తున్న మనసుఫై 
విరుచుకుపడుతున్న పని వత్తిడి ఫలితం
                 నవ్వులపువ్వులు పెదవులఫై విరబూయాల్సిన క్షణం
                 బాధల కేదారంలో ముడుచుకుపోతున్న బాల్యం 
స్వేచ్చ లేదు 
ఆనందం లేదు ఆత్మీయత లేదు 
అమ్మ నాన్నల ప్రేమ  తెలీదు 
                వెట్టిలో,నిర్భందాలలో 
                గనుల్లో,ఫ్యాక్టరీలలో 
                పొలాల్లో,ఇళ్ళల్లో,
                నలుగుతున్న పసిడి బాల్యం 
కాయలు కట్టిన చేతులు 
బరువులతో వంగిన భుజాలు 
పని అలసటలో దైన్యం నిండిన కళ్ళు 
ఎంత కష్టం -ఎంత కష్టం 
               ఎవరున్నారు వారికి?
               వారివైపు పోరాడేదేవ్వరు   
               పిల్లలు పనిచేసి పెద్దలను బ్రతికించాలా?
               రక్షణ ఇవ్వాల్సినవారే   భక్షించాలా? 
ఎలా ఒప్పుకోవాలి ఈసంస్కృతిని   
పిల్లలకు జ్ఞానం అందించనిధీ ఇదేమి సమాజం  
మార్చాలి ఈసంస్క్రుతిని చట్టాలను 
పిల్లలను ఒడుల్లాంటి బడులలో సేదతీరనివ్వాలి 
వారి కనురెప్పల వెనుక విద్య కమ్మని కల కావాలి 
              స్వేచ్చ లోని మాధుర్యాన్ని 
              ఆత్మీయత లోని అనుభూతిని 
              అక్షరాల్లోని ఆకర్షణను  
చదువు లోని ఆనందాన్ని 
వారిని అనుభవి౦చ నీయండి
ఆపొద్దు ...ఆపలేరెవ్వరు  వారిని 
అరుగో వస్తున్నారు పిల్లలు బడులకు .. 

నీవే

కమ్మని కలలకు రాగం నీవే
ఆలసిన బ్రతుకుకు ఆమని నీవే
కలిసిన మనసుకు కావ్యం నీవే
విరిసే వలపుకు గమనం నీవే
నీ వూహల వెల్లువకే
నా పాటను శ్రుతి చేర్చు
నీ వెన్నెల హాసానికి
నా

ప్రేమ

ప్రేమ
ప్రేమ ఒక జీవనది
తల్లి స్పర్శ
తండ్రి పిలుపు
అక్క ఆప్యాయత
చెల్లి అనురాగం
అన్న అభిమానం
తమ్ముడి అనుబంధం
అమ్మమ్మ గోము
తాతయ్య మురిపెం
నానమ్మ నవ్వులు
జేజెయ్య దీవెనలు
ఇదంతా ప్రేమే కదా!

ప్రేమ

ఫూల పరిమళం
వెన్నెల వర్షం
హిమపాతపు చల్లదనం
ఉషోదయ గీతం
సంధ్యా రాగం
ఇంద్రధనుస్సు వర్ణం
ఇవన్నీ ప్రేమలా వుంటాయేమో!


కళ

తాళం
గానం
నాట్యం
మనోహర కళారూపానికి అందమైన రూపం

కవనం
శ్రుతి
లయ
మధుర గీతికకు పంచప్రాణం
వేదన
శోధన
రోదన
వెల్లువెత్తిన అణగారిన చైతన్యం
భాష్యం
భాషణ
భావుకథ
కొత్తపుంతలు తొక్కే కవిత్వం

e-తెలుగు

~~~~~~~~~~~~~


మనసు(Mind)

గతం గట్లు తెంచుకున్నా
మడవలేసి మనసు నాపాలి
వర్తమానపు వరంఢాలో నిల్చుని
భవిథకు మార్గాలు అన్వేషించాలి

కమ్మని కలలు(Sweat Dreams)

కమ్మని కలలకు రాగం నీవే
ఆలసిన బ్రతుకుకు ఆమని నీవే
కలిసిన మనసుకు కావ్యం నీవే
విరిసే వలపుకు గమనం నీవే
నీ వూహల వెల్లువకే
నా పాటను శ్రుతి చేర్చు
నీ వెన్నెల హాసానికి
నా మాటను క్రుతిగా కూర్చు