వ్యక్తిత్వ వికాసం

వ్యక్తిత్వం
          మానవుడు మొదట జంతువు లా జీవించినా తరువాత ఆహారం ,దుస్తులు,కుటుంబం ఏర్పరుచుకున్నతరువాత జీవితాన్ని జీవించే క్రమం లో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఆచరిస్తూ ,అలవాట్లు మార్చుకుంటూ ప్రస్తుతమున్న స్థితికి చేరుకున్నాడు.
         కాని ఈ స్థితి మనిషికి సరి అయినదేనా !మన ఆలోచనా ధోరణి, మన ప్రవర్తన ,మనం ఆచరించే  పద్ధతులు ఇవన్నీ మన ఎదుగుదలకు సరిపోతున్నాయా లేదా అని ఆలోచించుకుంటే మనకు లోపమెక్కడుందో అర్థమవుతుంది.ఆ కాస్త సమయం మనం మన మనసుకు ఇస్తే అది చాల సరిచేసుకుంటుంది.కాని అంత తీరిక మనకుందా!
       వ్యక్తి యొక్క తత్వాన్నివికసింపచేసుకోవటమే వ్యక్తిత్వ వికాసం.ఇది చిన్నప్పట్నుంచి విద్యార్థులకు పాటాల్లో భోధిస్తే  దేశం ఎంతో అభివృద్ది చెందుతుంది.వ్యక్తి వికాసమే కదా దేశం, ప్రపంచ వికాసం. అలాగే విభిన్న వృత్తుల్లో వున్న  వారికి వృత్తిలో శిక్షణ తో పాటు మానసిక పరివర్తన కొరకు శిక్షణ అవసరం .మనిషి ప్రతి విషయాన్ని  గ్రహించి,విశ్లేషించుకునే సామర్థ్యాన్ని కలిగివుంటాడు.కాబట్టి విషయాన్ని తెలుసుకుని తన మనసుకు పనిపెడితే సరి.మనసుకు ఆలోచించే సమయం ఇస్తే అది అద్భుతాలు సృష్టిస్తుంది .మరిన్ని విషయాలతో కలుద్దాం .    


మన ప్రవర్తన ఇతరులతో మన  సంభందాలద్వారా వ్యక్తమవుతుంటుంది .మన ఇంట్లో, మన బంధువులతో మనస్నేహితులతో ,మన ఉద్యోగం లోని సహచరులతో మరియు ఇతర వ్యక్తులతో మనం ఏవిధంగా వ్యవహరిస్తున్నాము అన్న దాన్ని నిరంతరం పరిశీలించు కుంటూ  వుంటే మనకు మన ప్రవర్తన అద్దంలా కనపడుతుంది.మరి ఈ పరిశీలనకు  ప్రతిరోజు మనం కొంత సమయం కేటాయించాలి.అదే విధముగా విభిన్న పరిస్థితు లకు మన స్పందనలు కూడా మన వ్యక్తిత్వాన్నినిర్ణయిస్తాయి.మరి ఈ మొత్తం ప్రక్రియను మనం ఎలా పరిశీలించాలి.మన మనసుతోనే ఈ పని  అంతా జరగాలి.అంటే మనం మనసు చేసిన పనులన్నింటిని దానితోనే పరిశీలించాలి.
             ఇది ఎలా సాధ్యం .తనఫై తనే విచారణ చేపట్టాలి.మన కోర్ట్  లాగా .ఈ విచారణ లో మనమే న్యాయవాది, న్యాయమూర్తి , ఆరోపించేది,ఆరోపించ బడేది.అన్ని మనమయి విచారణ జరగాలి .ఇది  సాద్యమా !సాధ్యమే కాని దీనికి  మనల్ని మనం నిరంతరం మెరుగు పరుచుకుంటూ ఉన్నత మయిన  జీవితం గడపాలనే కోరిక వుండాలి.
           అప్పుడు ఎవరికి వారికే తమ ప్రవర్తన లోని లోపాలు స్పష్టంగా అర్థమవుతాయి.మనం ఎన్నో పుస్తకాలు ,మరెన్నో ఉపన్యాసాలు ఎంతమందో వ్యక్తుల్ని కలుస్తూ  ఉంటాము .మంచి విషయాలు తెలుసుకున్న ప్రతిసారి ఉత్తేజం పొందుతాము.కాని రోజులు గడిచేకొద్దీ మరల మన మామూలు జీవితం లో వుండి   పోతాము.
           దీనికి కారణం మనం ఎప్పుడు ఫైన    చెప్పిన ప్రక్రియకు  సమయము కేటాయించక పోవటమే.మరి ఈ దిశలో ఆలోచిద్దామా !
                                    
                                             మన వ్యసనాలను మానుకోవటం ఎలా?1

 
  వ్యసనం గురించి తెలుసుకునే ముందు అలవాటు అంటే ఏంటో తెలుసుకోవాలి.మనం రోజు క్రమం తప్ప కుండా చేసేవాటిని అలవాటు అనవచ్చు.ఉదాహరణకు కాలినడక,మంచినీళ్ళు త్రాగటం,వ్యాయామం చెయ్యటం సంగీతం వినడం,పుస్తకాలు చదవటం,యోగా,ధ్యానం చెయ్యటం లాంటివి.అలాగే కొంతమంది రోజు సిగ రెట్లు ,బీడీ లు,చుట్టలు,మద్యం త్రాగుతారు.కొంతమంది గుట్కాలు,మాదక ద్రవ్యాలు వాడతారు.ఫై అలవాట్లను వదలకుండా ప్రతి రోజు చేస్తూ వుంటారు.
           మరి మీకు  పాటికే అర్థమయి వుంటుంది.ఏవి మంచి అలవాట్లో?ఏవి చెడు అలవాట్లో?ఇక్కడ మంచిచెడు అంటే అర్థం ఏమిటి?దేనికి మంచి! అలవాట్ల వలన మనకు ఆరోగ్యపరంగా,మానసికంగా, కుటుంబపరంగా సామాజి కంగా మేలు జరిగితే మంచి అలవాట్ల క్రింద లెక్క.అలాగే కీడు జరిగితే చెడు అలవాట్ల క్రింద లెక్క.
        కొంతమంది ఫై అలవాట్లను వదలలేని పరిస్థితికి చేరుకుంటారు.ఉదాహరణకు వ్యాయామం చెయ్యకుంటే ఏదో లాగా వుండటం,యోగా చెయ్యకుండా వుండలేకపోవటం,పుస్తకాలు విడవకుండా చదవటం అప్పుడు వాటిని మంచి వ్యసనాలు అంటారు. అలవాటును మనం వదలలేని స్థితికి చేరుకున్నా మన్నమాట.
              మరికొంతమంది కాఫీ ,టీ లు ప్రతి రోజు 4 లేక ,5 సార్లు (ఇంకా ఎక్కువ సార్లు త్రాగేవారు చాలా మంది వున్నారు)త్రాగకుండా వుండలేకపోవటం,సిగరెట్లు రోజు 2  లేక,3 packs  త్రాగకుండా ఉండలేక పోవటం,ఇక మద్యం సేవించకుండా వుండలేకపోవటం ఇవి చెడ్డ వ్యసనాలుగా మనం పరిగణించవచ్చు అంటే అలవాటు యొక్క తారాస్థా యి వ్యసనం అన్నమాట .
           మరి  అలవాట్లు ఎందుకు చేసుకోవాలి?ఎందుకు వదులుకోవాలి?అవి వ్యసనాలుగా మారేంత స్థితి ఎందు కు వచ్చింది ?వీటిని పరిశీలిద్దామా!
             ఏదయినా మనం క్రమం తప్పకుండా ఒక పనిచేస్తువున్నామంటే అందులో ఏదో మనకు త్రుప్తి ,సుఖం ,సంతోషం,ఆనందం దొరుకుతున్నట్లు భావిస్తాం . త్రుప్తి మరల మరల మనసు కోరుతున్నదన్నమాట!ఇక మన సు కోరినదే తడవుగా మన ఇంద్రియాలు వాటిని తీరుస్తున్నాయన్నమాట !ఉదా హరణ కు కాఫీ,టీ లు త్రాగిన తరు వాత ఎలా వుంటుంది.మనసులో ఎక్కడో  త్రుప్తి!మరికొంతమందికి కాఫీ ,టీ లు పడనిదే ప్రక్రుతిపిలుపులు కూడా రావు.అలా నిబధ్ధమయి పోయి వుంటారు.అంటే అది వ్యసనం స్థాయికి చేరిందన్నమాట!అదేవిధంగా బీడిలు ,సిగ రెట్లు,చుట్టలు(విదేశాల్లో సిగార్స్ )త్రాగటం !ఎంతో ఇష్టం గా కాల్చి పారేస్తుంటారు .ఎక్కువగా ఒత్తిడి తో కూడిన పను లు  చేసేవారు,వీటిని ఖచ్చితంగా కాలుస్తారు.ఇక మద్యం త్రాగటం  social status నేడు.ఒకప్పుడు  త్రాగుతారా!అని ఆశ్చర్యపోయేవారు.ప్రస్తుతం త్రాగరా!అని అంటున్నారు!ఇలా  అలవాట్లు వ్యసనం స్థాయికి చేరుకొని మనుషుల ఆరోగ్యం ఫై తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి.
         తరువాతి వ్యాసం లో మంచి అలవాట్లను చేసుకోవటం ఎలా?చెడ్డ అలవాట్లను మానుకోవటం ఎలా?గురించి తెలియ చేస్తాను.


చెడ్డ వ్యసనాలను మానుకోవటం ఎలా?2
            మంచి
 అలవాట్లు ఏవో చెప్పుకునే ముందు చెడ్డ అలవాట్ల గురించి ఆలోచిద్దాము.ఇంతకుముందు వ్యాసం లో చెప్పుకున్నట్లు మొట్టమొదటగా ఆరోగ్యాన్ని దెబ్బ తీసేవన్నీ చెడ్డఅలవాట్లే! వాటిలో పొగాకు ఉత్పత్తులన్నీ హాని కలిగించేవే !బీడీలు,సిగరెట్లు ,చుట్టలు,గుట్కా,ఇలా!ఇవి ఎన్నో రకాల క్యాన్సర్ లకు కారణమవుతున్నాయి.దీని గురించి అవగాహన వున్నవారు వారు సయితం  వ్యసనంలో నుండి బయటకురాలేకపోతున్నారు.ఉదాహరణకు డాక్టర్స్ కూడా!కొన్ని దేశాల్లో పొగాకు పంటను బాగా తగ్గించి వేస్తున్నారు.మన(భారత్ ) దేశం లో కూడా వీటిని నిరు త్సాహపరచటానికి  పన్నులు  పెంచుతున్నారు.
       అలాగే మద్యం విశ్వవ్యాపితమయిపోయింది.ఆల్కాహాల్ గుండె జబ్బులకు ప్రధాన కారణమవుతుంది. సామా జిక  హింసకు దారి తీస్తుంది .వాహన ప్రమాదాలు,గృహహింస,హత్యలకు,మానభంగాలకు మద్యం ప్రధాన కారణ మవుతుంది.ఇక డ్రగ్స్ తీసుకోవటం వ్యసనాలకు పరాకాష్ట.మనిషిని ఇవి నిర్వీర్యం చేస్తున్నాయి.మనిషి  పూర్తిగా పతనమయ్యాడు అనటానికి ఇది నిదర్శనం.పెద్ద కుటుంబాల వారి పిల్లలు,యూనివర్సిటి ,కాలేజీ విద్యార్థులు  మహమ్మారి బారిన పడుతున్నారు.మనిషి ప్రతి రోజు  పొడులు,ఇంజక్షన్స్తీసుకోక పోతే ఎంతో బాధను, వేదనను అనుభవిస్తారు.ఇవి తీసుకొని విపరీతమయిన హింస, అత్యాచారాలు చేస్తున్నారు.
           ఇక పేకాట(ప్లేయింగ్ కార్డ్స్ ),గుర్రప్పందాలు(రేసులు ) ,కాసినోస్,క్లబ్స్, పబ్స్ వీటిల్లో మనిషి పూర్తిగా డబ్బు పోగొట్టుకొని సంసారాలు నాశనం చేసుకొంటున్నాడు.అలాగే షేర్లు కూడా!తన సంపాదనలో  పది శాతం అయితే పర్లేదు కాని పెద్ద ఎత్తున వీటిల్లో పెట్టుబడి పెట్టటం కూడా ప్రపంచం లో  సంక్షోబానికి కారణ మయ్యాయి.దీర్గకాలిక మదుపుకయితే పర్లేదు, వార్రెన్ బఫేట్ లాగా! రోజు చేసే ట్రేడింగ్,ఫీచర్స్,ఇవన్నీ మనిషిని నిలువునా దగా చేసేవే! మనిషి లోని అత్యాశకు ఇవి ప్రతిబింబాలు.వీటిని ఆర్ధిక వ్యసనాలు గా చెప్పవచ్చు.
        ఇక పోతే విపరీతంగా కూల్ డ్రింక్స్ త్రాగటం ,కూల్ డ్రింక్స్ లో ఏమేమి ఉంటాయో డిల్లి కి చెందిన ఓ ఆరోగ్య సంస్థ రెండు సంవత్సరాల క్రింద ఇచ్చిన నివేదిక  భారత్ లో ఓ  సంచలనం.వాటిల్లో పురుగుమందుల అవశేషాలు కని పిమ్చాయని చెప్పింది రైతులు  వీటిని పొలాలకు కొడితే పురుగులు చనిపోయాయి.అమెరికాలో మంచినీరు త్రాగకుండా ఎక్కువగా  డ్రింక్స్ త్రాగుతున్నారని ప్రభుత్వం మంచినీరు త్రాగమని చెప్పాల్సివస్తుంది.ప్రతిరోజు ఒక 250ml  త్రాగేవారికి  చాలా  ఆరోగ్య  సమస్యలు  వస్తాయని తాజా వార్తలు.ఇక వీటిని ఫ్యామిలీ డ్రింక్స్ లాగా ఫ్రిజ్ లో పెట్టుకొని త్రాగుతుంటారు.
        కాఫీ ,టీ లను చివరిగా ఎందుకు చెబుతున్నానంటే 1 లేదా 2  కప్పులయితే పర్లేదు! కానీ చాలా మంది ఇంత కంటే ఎక్కువగా త్రాగేవారే!ప్రకృతి  వైద్యులు ఇది కూడా ఒప్పుకోరు.ఇందులో వుండే కెఫీన్ మెదడు ఫై ప్రభావం చూపించి  రుచిని మరల కోరుకోవటం వలన ఎక్కువ సార్లు త్రాగుతారు.దీని వలన ఆకలి మందగించటం అసరిగా అరగకపోవటం, అజీర్తికి దారి తీ స్తుంది .ఏది ఏమి అయినా  అలవాటు వ్యసనంగా మారకుండా చూసుకోవాలి.
         మరి ఫైన చెప్పిన వ్యసనాలు  అన్ని చెడ్డ వ్యసనాలే.మరి మంచి వ్యసనాలు ఉంటాయాతరువాత చెబుతాను . చెడ్డ వ్యసనాలు వున్నా వారు కూడా అందులోంచి బయట పడాలని చూస్తుంటారు.కాని మిత్రులు ,వీకెండ్ పార్టీస్,సమావేశాలు ,ఆఫీసులలో కొలీగ్స్  కారణంగా  వీటిని వాడలేని పరిస్థితికి వస్తారు.ఆరోగ్యం డబ్బు ఇలా ఎన్నో కోల్పోవలసివస్తుంది. మొదట వీరు చేయాల్సింది,పొగాకు ఉత్పత్తులు ,మద్యం ,  డ్రగ్స్   తీసుకునేవారు వాటివల్ల
 నష్టాలని ఇంటర్నెట్ లో గాని డాక్టర్స్ ద్వారా గాని,స్పష్టం గా తెలుసుకోవాలి.ఎప్పుడయితే  నష్టాలు అర్థమవుతా యో వారిలో మానసిక పరివర్తన కలగవచ్చు.ప్రతి వ్యక్తి తన మనసు ఈ విధంగా ఎందుకు అలవాటు చేసుకుందో విశ్లే షించుకోవాలి.తనఫై  ఆధార పడ్డ కుటుంబ సభ్యుల ముఖాలను అవి తీసుకునే టపుడు గుర్తుకు తెచ్చుకోవాలి .వారి అమాయక  మయిన  ముఖాల్లోని స్వచ్చత ,వారు మీపట్ల చూపించే ప్రేమ,ఇన్నింటిని మీ వ్యసనం అదిగమి స్తుంటే  వారి ప్రేమకు మీరు విలువ ఇవ్వనట్లే!కుటుంబ పెద్ద చెడు వ్యసనాలకు లోనయి కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తుంటే ఆ కుటుంబ సభ్యులు మౌనం గా రోదిస్తుంటారు.మద్యం వలన కొన్ని కోట్ల కుటుంబాలు,ఆర్థికం గా ఆరోగ్య పరంగా చితికిపోతున్నాయి.గృహ హింస తీవ్రంగా ప్రబలి పోతుంది.స్వచ్చ మయిన  అమాయక మయిన తన బిడ్డల  ముఖం ఫై చిరునవ్వు చెదరకుండా ఉండాలంటే ఫై వ్యసనాలు మానాల్సిందే.అలా పరివర్తన కొంతమందికి వస్తుంది.
                 అప్పటికి మారనివారు ఆరోగ్యం దెబ్బతింటే ఎలావుంటుందో ఒక్క సారి ఊహించుకోవాలి.అలా ఆరోగ్యం దెబ్బతిన్న వారిని కలుసుకొని వారి కష్టాలు తెలుసుకోవాలి.అప్పుడు మరికొంత మందికి మార్పు రావచ్చు.
ఇక ఈ వ్యసనాలు పరాకాష్టకు చేరిన వారికి సహాయ కేంద్రాలు  వున్నాయి .అక్కడ చక్కటి సలహాలు,సూచనలు కొంత చికిత్స తో ఈ వ్యసనాలు మాన్పిస్తారు.ఈ విధం గా మనిషి తలుచుకుంటే ఖచ్చితంగా వాటికి బానిస కాకుండా వుండగలడు.ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా వారి ఫై ద్వేషం పెంచుకోకుండా ప్రేమతో వారిని సన్మార్గం లోకి తేవచ్చు.ఈ వ్యాసాన్ని దయచేసి ఈ అలవాట్లు ఉన్నవారితో చదివించగలరు.ఆ రకం గా వారికి మీరు సహాయం చేసినట్లే! 
          తరువాతి వ్యాసంలో మంచి అలవాట్లు చేసుకోవటం ఎలా ?అన్న విషయాలు ,అవి ఏమిటి వివరిస్తాను. 





మీ
 జీవితాన్ని ప్రభావితం చేసే 10 మంచి అలవాట్లు చేసుకోవటం  ఎలా !(3)

                ఇంతకు ముందు వ్యాసంలో చెప్పుకున్న చెడు అలవాట్ల స్థానంలో  అలవాట్లువుంటే మనసు  తృప్తి పడ్తుంది,ఏవి ఆరోగ్యానికి మంచిది,ఏవి ఆర్థికంగా సామాజికంగా ఉపయోగపడతాయి అలవాట్లు మనకి మన జీవితంలో ఆనందాన్ని కలిగిస్తాయి?అన్న విషయాలు చూద్దాము.మనిషికి ప్రాథమికం గా తృప్తి,హాయిఆనందం కలిగించేవి మొదట గమనిద్దాము.
        1)మనకున్న పంచేంద్రియాల గురించి మొదట ఆలోచిద్దాము.కంటికి ప్రకృతి,అందమయిన దృశ్యాలు ఆనందా న్ని కలిగిస్తాయి . ప్రతిరోజు ఆకాశాన్ని,సూర్యోదయ ,సూర్యాస్తమయాలను,చంద్రుని వెన్నెలను ,నక్షత్రాలను ,చెట్లను ,పక్షులను గమనించగలిగితే ఎంతో ఆహ్లాదం గా వుంటుంది.అలాగే అందుబాటులో వున్నవారు కాలువలు ,నదులు ,సముద్రాలకు,ఉదయం,సాయంత్రం షికారుకు వెళ్ళగలిగితే  నడకలాగా అనుకుంటే ఎంత బాగుంటుంది.ప్రకృతిని మనం కళ్ల ద్వారా మనసులో నింపితే మన మనసు విశాలమవుతుంది.దీన్ని మించిన తృప్తి ఇంకోటి లేదు.ఎక్కడికి పోలేని వారు తమ ఇంటి ఫై కెక్కిగమనిస్తే సరిఅవకాశం,పరిస్థితులు    అనుకూలించిన  వారు వారాంతం లో ఒక ప్రాంతానికి  వెళ్లి అక్కడి దృశ్యాలను మనసు లో నింపుకొని వారం పాటు  ఆనందాన్ని ఫొటోస్,వీడియో  ద్వారా ముచ్చటించుకుంటూఆనం  దించవచ్చు.ఇంటర్నెట్ లో అందమయిన ప్రకృతి నివీక్షించవచ్చు .నదులు,సముద్రాలు ,పర్వతాలు లోయ లు,సరస్సులు మొత్తం నెట్ లో వీడియో  రూపం లో వున్నాయి.అన్ని ప్రాంతాలకు పోవటం కుదరదు కాబట్టి గూగుల్ ఎర్త్ తో హిమాలయాల ఫై విహరించ వచ్చు.మీకు ఇంకా ఎన్నో ఆలోచనలు రావచ్చు ప్రకృతి పట్ల ప్రేమను పెంచుకోండి మనసంతా ఆనందం తో నిండి పోతుంది.ఇదంతా కన్ను తెరిస్తే ఆనందం .కన్ను మూస్తే ఆనందం కలగాలంటే చక్కటి నిద్ర కావాలి.సగటు మనిషికి వయసు ను బట్టి నిద్ర అవసర మవుతుంది .చిన్నపిల్లలకి పది నుండి పన్నెండు గంటల నిద్ర అవసరం.కొద్దిగా పెద్ద పిల్లలకి 8-10 గంటల కాలేజీ పిల్లలకి  6-10 గంటల నిద్ర అవసరం .25-45 వయసు గల వారికి ఆరు,లేదా ఏడుగంటలు నిద్ర కావాలి ఇక  ఫైన ఆరుగంటలు నిద్ర పట్టిందంటే ఆరోగ్యానికి మంచిది.ఇది నేను సుమారుగా చెప్పానుఅప్పుడప్పుడు పాటించకపోయినా  సాధ్యమయినంతవరకు ఒక పద్ధతిలో ఫై అలవాటును గనుక పాటించినట్లయితే  మంచి ఆరోగ్యం మీ సొంతం.
2)ఇక రెండవ అలవాటు !చెవులకేమి కావాలి!.మధురమైన సంగీతం ,మనసుకు నచ్చిన పాటలు వింటూ వుంటే ఆనందలోకాలలో తేలినట్లు ఉండదా!శాస్త్రీయ సంగీతం ,ఇష్ట పడేవారు,మధుర స్వరాలు పాత పాట లు ,ఆధునిక పాటలు నచ్చేవాళ్ళు ఇలా ఏదయినా మీ మనసుకు నచ్చింది వింటుంటే అదే కదా ఆనందం దీనితో పాటు సెలయేటి గలగలలు,జలపాతాల హోరు,పక్షుల కిలకిలలుకోయిల గానాలు ఏటి ఒడ్డున నీటి సవ్వడులు  విధంగా ప్రకృతి పలికించే విభిన్న సంగీతాలను  వినటం  కళ!  .హరిప్రసాద్ గారి sound of deserts,sound of rivers లాంటి ప్రకృతి  సంగీతాన్ని వినగలిగితే మనసుకెంత హాయి!
3)ఇక  నాసిక  ద్వారా  పొందే  తృప్తి ,ఆనందం  విషయానికి  వస్తే పూల పరిమళం  మనసు  నెంత మత్తెక్కి స్థాయి సుగంధ ద్రవ్యాలు,అగరుబత్తి,ఇంకా నాసిక కు ఏవి హాయినిస్తాయో వాటి మధ్య నుండ గలిగితే ఇక మనసు వేరే వ్యసనాల కోసం ఎందుకు చూస్తుంది.దీనిని ఒక అలవాటుగా మారిస్తే ఎలా వుంటుంది.
4)ఇక నోటి  రుచుల విషయానికి వస్తే జిహ్వ చాపల్యం మనల్ని ఎన్నో కోరికలను కోరు తుంది .పండ్లు,వాటి రసాలు పచ్చి కూరగాయలు వాటి సలాడ్ లు మొలకలు,త్రుణధాన్యాలు ఆహారం లో భాగంగా చేసుకొంటూ అప్పుడప్పుడు రుచి కోసం విభిన్న రకాల పదార్థాలను ఆస్వాదిస్తుంటే మంచిది.టీ,కాఫీ,కూల్ డ్రింక్స్   బదులుగా కొబ్బరి నీళ్ళు మజ్జిగ,పండ్ల రసాలు అలవాటుగా చేసుకుంటూ ఎప్పుడై నా రుచికోసం వాటిని తీసుకోవచ్చు.
5)ఇక మనసు చెడ్డ వ్యసనాలనుంచి  బయటకు రావాలంటే చివరిది అయిన స్పర్స గురించి ఆలోచిద్దాము మొక్కలు చెట్లు,పూలస్పర్శను పొందటంఈత ద్వారా నీటి స్పర్శను,చక్కటి  వైవాహిక సంబంధం గడుపుతూ మంచి శృంగారాన్ని అనుభవించటం ,బిడ్డల్ని ప్రేమ తో దగ్గరికి తీసుకోవటం ,జంతువులను పక్షులను స్పృశిస్తూ వాటి స్పందనలను గమనించటం మనసుకు ఎంతో తృప్తి ఆనందాన్ని ఇవి ఇస్తున్నప్పుడు ఇక సమయమెక్కడుంటుంది చెడ్డ వ్యసనాల జోలికి పోవటానికి !
6)ఇక మిగిలిన వాటి గురించి చూద్దాము.ఇవికూడా ఫై వాటి క్రిందకే వస్తాయి.కాకపోతే ప్రత్యేకంగా చెబుతు న్నానువ్యాయామం ప్రతిరోజు చేయటం ఎంత చక్కని అలవాటు.దీని గురించి ఇంతకు ముందు వ్రాసాను.మీ కిష్ట మయినది  ఎన్నుకోండి.నడక,ఈతయోగ ఆసనాలు,ప్రాణాయామం ధ్యానం మీ కను కూల   ఎన్నుకోండి .క్రమం తప్పకుండా చేయండివిద్యార్థులకు ఆటలు పెద్ద వారికి ప్రత్యేక వ్యాయామాలు మంచిది.కొంత మంది ఒక  నెలరోజులు జిం నకు వెడతారు,మానేస్తారు.అయిన  మరల మరల మొదలు పెడుతూనే వుండండి.
7)పుస్తక పఠనం మీ అభిరుచికి అనుగుణ మైన పుస్తకాలు చదవండి.ఆరోగ్యం,వృత్తి,వ్యక్తిత్వ వికాసం ,తత్వం ,మంచి నవలలు ఇలా ఎన్నో విభాగాలున్నాయి .కనీసం నెలకు ఒక పుస్తకమన్నపూర్తి అయ్యే వి ధంగా  రోజుకి కొన్ని పేజీ లు  చదివే అలవాటు మంచిది.రచయితలు ఎంతో మధించి వ్రాస్తారు.వారి అనుభ వాన్ని మనం చదివి మన కనుగుణంగా విశ్లే షింకుంటే బాగుంటుంది.ఇది ఒక చక్కటి అలవాటు.
8)మీకు  ఎన్నో  చేయాలని  వుంటుంది .అన్ని చేస్తూ  ఒక్క దాని మీద పూర్తి దృష్టి పెట్టకుండా వుంటారు .అలా కాకుండా మీకు  అభిరుచిలో ప్రావీణ్య మున్నట్లనిపిస్తుందో దాన్నేఅలవాటుగా రోజు చేయగలిగితే ఎంత బాగుం టుంది!ఇది ఎవరికి  వారు ఎన్నుకోవాలి.
9)ఇక మీతో మీరు గడపటం ఇదికూడా ఒక అలవాటేనా అనుకోకండి!ఒక్కరు ఎవరు తోడు లేకుండా ఇంటి ఫైన గానిమీ ఏకాంత మందిరం లోగాని ఏమిచేయకుండా గడపటం బహుశా  ధ్యానం అనుకుంటారు..కే అది కొంతవరకు మంచిదే!దాని కంటే  ఏకాంతం లోనే మనకు మనం మన మనసును గమనిస్తూవుంటే  ఎలా వుంటుందో చూడండి.మీకు తెలియని కొత్త ఆనందం మీ మనసులోకి వస్తుంది.ఇంకా ఒక సాయంత్రం అంద మైన చెట్ల దగ్గరికి వెళ్లి ప్రకృతిని గమనిస్తూ   ఏకాంతాన్ని ఆనందించండి.
10)ఇక చిట్టచివరిగా మన మనసుకు ఆనందం కలిగించేది సేవ !దీన్ని విభిన్న రకాలుగా చేయవచ్చు డబ్బుతో మాత్రమే కాదు.ఆలోచించండి. బ్లాగు లో సేవ పేజి  చూడండి.మీకే ఎన్నో ఆలోచ నలు మనసులోకి వస్తాయి.అది ఎంత చిన్నదైనా ఒకటి చేయండి.
       నేను ఆచరించేవి,గమనిం చినవి   కొన్ని మీకు చెప్పాను అన్ని చేయాలని లేదు.లోకో భిన్నరుచి !మీ దగ్గర కూడా అద్భుత మైన అలవాట్లు ఉండవచ్చు.మీరు మీ భావాలను పంచుకోండి.ఇవి అన్ని ఒకరకం .మన ప్రవర్తన కు సంబందించినవి వేరే వ్యాసం లో వ్రాస్తాను.
మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవటమే  మంచి అలవాట్ల లక్ష్యం.