Saturday 31 March 2012

బాధించే జ్ఞాపకాలు మరచి పోవటం ఎలా? 2



ప్రేమలో వైఫల్యం
,స్నేహితుల మధ్య మనస్పర్థలు,office లలో సహచరులతో వాగ్వాదం,బంధువులతో మాట తేడాలు,భార్యా భర్తల ఎడబాటు,మాట జారటం ,ఆస్తి పంపకాలు,సంసారం లో సమస్యలు,సంతానం సరిగా చూడకపోవటం,ఇక మన చదువులలో ,మన వృత్తులలోమరిన్ని  ఓటములు,అనుకున్నది సాధించుకోలేక పోవటం,సరి అయిన సమయానికి సరి అయిన నిర్ణయాలు తీసుకోలేక అవకాశాలు కోల్పోవటం,కలగన్నవి పొందలేకపోవటం,,బంధువుల,సన్నిహితుల  మరణం ఇలా మన జీవితం లో ఎక్కడో ఒకచోట లేదా పలు సందర్భాలలో ,మనసుకు ఎంతో బాధ కలిగించే సంఘటనలు మనకు తటస్తించి వుంటాయి.అవన్నీ మన మనస్సులో జ్ఞాపకాలుగా స్థిరపడి పోయుంటాయి.
               ఇక వర్తమానం లో  జ్ఞాపకాల ఆధారం గా మన  ఆలోచనలు,నిర్ణయాలు,మాటలుప్రవర్తనఅభిప్రాయాలు అన్నీ రూపుదిద్దుకుంటాయి.ఇవి ఆజ్ఞాపకాలలోని బాధలను దూరం చేసేవైతే ఫర్లేదు.
గుణపాటాల్లాగా తీసుకుని మరల చేసిన ఆ తప్పులు దొర్లకుండా  అనుభవాలని పునాది చేసుకుని జీవితాన్ని మరింత ఉన్నతంగా దిద్దుకోవడానికి ఉపయోగించుకున్నంత వరకు  మంచిదే.
                  సంఘటనల్లోని  బాధను,ఓటముల్ని,అవమానాల్ని,గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటే  మనసు నూతనత్వాన్ని కోల్పోతుంది.వర్తమానం లోని ఆనందాన్ని అనుభవించలేదు.మన జీవితం లోని ప్రతిది నూతనం గా క్రొత్తగా వుంటుంది.ప్రకృతి అలాగే వుంటుంది.ప్రతి క్షణం గతించిన క్షణానికి భిన్నం గా వుంటుంది.భూమితో సహా సూర్య చంద్రాదులు  ప్రతిక్షణం వేగంగా ప్రయాణిస్తూ వుంటాయి .వాటి కనుగునంగా భూమి ఫై  మార్పులు కూడా చలి,ఎండా ,వాన,రుతువుల్లో మార్పులు ఇవన్నీ అంతే!మరి మనలో కూడా కాలం నూతనత్వాన్ని మోసుకొస్తూ వుంటుంది.మనం అందులో ఉండకుండా గతం     బాధలోనో ,భవిష్యత్తు పట్ల భయంతోనో వర్తమానం లో వుండలేకపోతున్నాము. క్షణం ఒక సజీవ దృశ్యం.t.v లలో ప్రత్యక్ష ప్రసారం ఎంత కుతూహలం గా చూస్తాము.రికార్డు అయిన ప్రోగ్రాం లో అంత మజా ఉంటుందా !
                   ఇక వాటిని మరవటం ఎలా?మన శరీరం చిన్న గాయాల్ని జబ్బుల్ని తనకు తానే బాగుచేసుకుంటుంది.కొద్దిగా పెద్దవి వైద్యసహాయం తో సరిచేసుకుంటుంది.కొన్ని సందర్భాలలో ఆయా భాగాలను తీసివేసి  సమస్యకు పరిష్కారం చేస్తారు.అంతేకాని వచ్చిన రుగ్మతను సరిచేసుకోకుండా అలాగే వుంటే క్రమేపి శరీరం మొత్తం దెబ్బతింటుంది.మరిమనసు అంతేగదా గతం లో సమస్య ప్రస్తుతం బాధిస్తుంది .పరిష్కారమేమిటి?వాస్తవానికి మన చిన్నప్పటి సంఘటనలన్నీ మనకు గుర్తువున్నయాలేదుకదా అలా గుర్తుండి వుంటే మన బుర్ర వేడి ఎక్కి పిచ్చెక్కి వుండేది.చాలా విషయా లు మనం మరచి పోతు ఉంటాము .అంటే తనకు తాను మనసు శుభ్రం చేసుకుంటుంది.కాని పయిన చెప్పిన జ్ఞాపకాలు అంత త్వరగా మనసు తీసివేసు కోలేదు.మరి ఎట్లా !
            చూడండి.రోజు వార్తా పత్రికలలో t.v లలో ఎన్నో ఘోరాలు,నేరాలు జరుగుతుంటాయి.అయ్యో అనుకుంటాము.మరచిపోతు ఉంటాము.అలాగే మన కష్టాల కంటే ,బాధలకంటే ,ఓటముల కంటే నష్టాలకంటే మరింత పెద్దవి ,ఇతరుల జీవితాల్లోనివి తెలుసుకొని పాపం అనుకోని వదిలివేస్తుంటాము అంతకంటే మనవి చాలా చిన్నవి అయినా మనం మరచిపోలేము.అలాగే మన దగ్గరివారు ఇబ్బందుల్లో వుంటే వారిని ఓదార్చుతుంటాము .మరచిపోవాలండి!పోయిన వారితో మనం పోతామా అంటూ!అంటే మనకు మరచిపోవటం చాలా బాగా తెలుసు.
   చాలా ఎక్కువయింది కదా !అందుకే  ముగింపు తరువాత!   



1 comment: